పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 7,తల్లాడ రిపోర్టర్ నియోజవర్గం లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు. సిండికేట్ గా మారి అధిక రేట్లకు అమ్ముతున్న వైనం. చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్న అ బ్కారీ శాఖ అధికారులు. కలెక్టర్ మద్యం విక్రయాలపై దృష్టి సారించరూ. మండలంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వీధికి ఐదారు చొప్పున పుట్టుకొస్తున్నాయి. వేసవికాలంలో తాగునీరు కొరత ఉందేమో కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది. ఇదే అదునుగా భావించిన మద్యం వ్యాపారులు మందుబాబుల జేబులను ఖాళీ చేసేందుకు మద్యం రేట్లు అధికంగా పెంచి వారి జేబులకు చిల్లులు పెడుతున్నారు. నెలరోజుల నుండి భారీగా పెరిగిన రేట్లు. ఖమ్మం జిల్లాలో మద్యం రేట్లు అధికంగా పెంచారు. నెలరోజుల క్రితం ఓఏబీ క్వాటర్ ధర రూ. 140, ప్రస్తుతం 160, మ్యాన్షన్ హౌస్ (ఎంహెచ్) 180 నుండి 210, ఎంసీ డైట్ 180 నుండి 210, ఇంపీరియల్ బ్లూ (ఐబి) 140 నుండి 210 రూపాయలు పెంచి అమ్మకాలు కొనసాగిస్తూ కోట్లాది రూపాయలను మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. అంటే ఒక్క క్వార్టర్ కు సుమారు 30 రూపాయలకు పైగా పెంచి మందుబాబుల నుండి డబ్బులు పిండుకుంటున్నారు. వీటితోపాటు బీర్లు 180 రూపాయలు ఉంటే ప్రస్తుతం 220 రూపాయలు తీసుకుంటూ నిలువు దోపిడి చేస్తున్నారు. సిండికేట్ గా ఏర్పడి. నెలరోజుల క్రితం ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు చేసిన మద్యం వ్యాపారులు అందరూ సిండికేట్ గా మారి రేట్లను విపరీతంగా పెంచారు. అంతేకాకుండా తల్లాడ మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు ప్రతి వీధికి దర్శనమిస్తున్నాయి. సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులు ఇదే అదునుగా భావించి కోట్లాది రూపాయలను దండుకుంటున్నారు. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అబ్కారీ అధికారులు.. పెనుబల్లిమండల వ్యాప్తంగా ఇంత భారీ మొత్తంలో మద్యం విక్రయాలు అధికంగా రేట్లు పెంచి అమ్మకాలు జరుగుతున్నప్పటికీ సంబంధించిన ఆబ్కారీ శాఖ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వేరే మండలాల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం అమ్ముతుంటే కల్లూరుమండలంలో రేట్లు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి అధిక రేట్లకు మద్యాన్ని అమ్మకాలు చేపడుతున్న మద్యం వ్యాపారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్న వైనం. మద్యం వ్యాపారులు ప్రస్తుతం మద్యాన్ని డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేపట్టారు. పదివేలకు పైగా మద్యం ఆర్డర్ ఇస్తే మద్యాన్ని ఇంటికి తీసుకెళ్లి సరఫరా చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం వ్యాపారులు డోర్ డెలివరీ చేపట్టి ప్రజల సొమ్మును విపరీతంగా దోచుకుంటున్నారు.