రణభేరి గంగమ్మ ప్రధాన అర్చకుడి మృతి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 07.06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా నియోజకవర0్గ చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// శక్తిక్షేత్రం బోయకొండ సమీపంలోని రణభేరి గంగమ్మ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్న నాగరాజ 65 ఆకస్మికంగా మృతి చెందారు కొండపై గల బోయకొండ గంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో తొలిదర్శనం గా భక్తులందరూ నుంచి పూజలు అందుకుంటున్న రణభేరి అమ్మవారి చెంత ఆయన వంశపార్యం పర్య ప్రధానార్చకులుగా ఉన్నారు ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు మదనపల్లికి తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు ప్రధానార్చకుడిగా నాగరాజ అందరికీ సుపరిచితుడు దీంతో ఆయన సొంత గ్రామం బొగ్గిటి వారి పల్లిలో విషాద ఛాయలు అలుము కొన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *