జి.ఎల్లయ్య జయంతినితెల్లాపూర్‌లోని ఎల్లన్న ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన కాలనీనామకరణం,విగ్రహ ఆవిష్కరణకి అతిథిగా విచ్చేసినజగదీశ్వర్ గౌడ్

పయనించే సూర్యుడు, జూన్ 07 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్య మకారుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత కీ.శే. జి. ఎల్లయ్య 85వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తెల్లాపూర్‌లో ని జి. ఎల్లన్న ఎన్‌క్లేవ్‌లో నిర్వహించిన కాలనీ నామకరణం,విగ్రహ ఆవిష్కరణ “ఎల్లన్న” పుస్తకావి ష్కరణ కార్యక్రమం లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పాల్గున్నారు . ఈ సందర్భంగా ఎల్లయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసు కుంటూ, బీహెచ్‌ఈఎల్ కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన విశేష కృషిని కొనియా డారు. ఒక సాధారణ కార్మికు డిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, కార్మిక హక్కుల కోసం నిరంతర పో రాటంతో జాతీయ స్థాయి నాయకు డిగా ఎదిగిందన్నారు. కార్మిక సంక్షేమం, గృహ వసతి, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు వంటి అనేక హక్కులను సాధించడంలో ఎల్లయ్య గారి పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు అలుపె రగని పోరాటం సాగించిన మహోన్నత ఉద్యమకారుడిగా ఆయనను స్మరించు కున్నారు. “కార్మికుల కోసం జీవించిన నాయకు డు… తెలంగాణ కోసం పోరాడిన యోధుడుకీ.శే.జి.ఎల్లయ్య సేవలు చిరస్మరణీయం.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *