వెదురుపాక పీఠాధిపతి గురుదేవులు సుబ్రహ్మణ్యం శివైక్యం తీరని లోటు

..,.నీరుకొండ వీరన్న చౌదరి

పయ నించే సూర్యుడు జూన్ 7 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) తూర్పుగోదావరి జిల్లా, , వెదురుపాక గ్రామంలో గల శ్రీ విజయదుర్గా పీఠాధిపతిగా సేవలందించిన శ్రీ వి.వి. సుబ్రహ్మణ్యం (గాడ్) శివైక్యం తీరని లోటు అని బిజెపి నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు . ఈసందర్భంగా అయన మాట్లాడుతూ. దేవీ ఉపాసన, ఆధ్యాత్మిక బోధనలు, యజ్ఞయాగాదులు, ధార్మిక సేవల ద్వారా వేలాది మంది భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన గాడ్ మరణం ఆధ్యాత్మిక వర్గాల్లో విషాదాన్ని నింపింది. అని అనేక సంవత్సరాలుగా వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ భక్తులకు మార్గదర్శకత్వం వహించారు.అని అన్నారు ఆయన ఆశీస్సులు పొందిన భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచీ కూడా పీఠానికి చేరుకుని సేవలు నిర్వహించేవారు. అని పిఠాదిపతి గాడ్ తో మాకుటుంబం మూడు తరాలుగా ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉండేవి అని మూడు తరాలుగా అయన మా కుటుంబం పై చూపే ప్రేమ అనురగాలు ఆశీస్సులు ఎప్పటికీ మరువలేము అని అన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు తో గాడ్ కు మంచి సత్సంబంధాలు కలిగి ఉండేవీ అనీ అతరుణంలో ఆనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాహ వేడుక గాడ్ సమక్షంలో జరగడం విశేషం అన్నారు అయన శివైక్యం పట్ల వీరన్న చౌదరి ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *