తిరుమాలి గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండి పోటీలు

పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 07 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : మండలంలో తిరుమాలి గ్రామంలో శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా 15 వ రాష్ట్రస్థాయి ఎడ్ల బండి పోటీలు శనివారం నిర్వహించారు. గ్రామ ఆలయ కమిటీ అద్వర్యంలో నిర్వహించిన ఈ ఎడ్ల బండి పరుగు పందాల పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్, జూనియర్, విభాగాల్లో పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో ఏడు ఎడ్లబండ్లు పాల్గొనగా జూనియర్ విభాగంలో 27 ఎడ్లబండ్లు పోటీల్లో పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో గుమ్ములేరుకు చెందిన కీర స్తుతి చౌదరి చెందిన ఎడ్లు బహుమతి గా ద్వితీయ ద్వితీయ అనకాపల్లికి చెందిన సిద్ధి వినాయక, వల్లపూడి గ్రామానికి చెందిన శ్రీ సిద్ధి వినాయక ఎడ్లబండ్లు ఎంపికయ్యాయి జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో తిరుమాలి గ్రామానికి చెందిన మాగాపు రాంబాబుకు చెందిన ఎడ్లు ప్రథమ బహుమతి గెలుచుకోగా మండపేట, గుమ్మిలేరు లకు చెందిన ఎడ్ల బండ్లు ద్వితీయ తృతీయ బహుమతులను అందుకున్నాయి. బహుమతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు సూతి బాబులు, చందువోలు రాజా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో రైతులను ప్రోత్సహించే విధంగా గత 15 సంవత్సరాలుగా తిరుమలి గ్రామంలో నేరేళ్లమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైతులను ప్రోత్సహించే విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పని జిల్లాల నుండి ఎంతో ఉత్సాహంగా రైతన్నలు ఈ ఎడ్ల బండి పోటీల్లో పాల్గొన్నారన్నారు. సీనియర్ జూనియర్ విభాగాలలో మొత్తం 34 ఎడ్లబండ్లు పోటీలో పాల్గొన్నాయని పాల్గొన ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందించమని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు కమిటీ సభ్యులకు ప్రజాప్రతినిధులకు పోటీల్లో పాల్గొన్న పోటీదారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆలయ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూతి భూరయ్య,పసలు సూరిబాబు, సిద్ధా నానాజీ, కే.కోటేశ్వరరావు, యనమల కృష్ణ, ఓలేటి చంటిబాబు, వరుపుల సాయి, కోరుకొండ నూకరాజు, కానూరి రాంబాబు, కోలా వీరబాబు, మాగావు వీరబాబు, ఊర నాని, చిక్కాల లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *