జనం న్యూస్ :7/6/2026,నంద్యాల టౌన్ రిపోర్టర్ కోనేటి వెంకటేశ్వర్లు, ‘నవోదయం 2.O’ లో భాగంగా గడివేముల మండలం ఎల్ కే తాండ లో అవగాహన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవోదయం 2.O’ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా గారి ఆదేశాల మేరకు, నంద్యాల జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సాదు రవికుమార్ గారి సూచనలు మేరకు ఈరోజు (శనివారం) గడివేముల మండలం ఎల్కేతాండ నందు నాటుసారా తయారీ, అమ్మకాల నివారణపై ఒక ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని, నాటుసారా వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ, ఈ వృత్తిని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని సాగించాలని పిలుపునిచ్చారు. అధికారుల ప్రసంగాలు – ముఖ్యమైన అంశాలు: ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు: నాటుసారా తయారీని పూర్తిగా మానుకునే కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ₹15,000 ఆర్థిక సహాయం (లోన్ ) అందించి, కిరాణా దుకాణాలు, కూరగాయల వ్యాపారం, గొర్రెల పెంపకం లేదా బర్రెల పెంపకం వంటి స్వయం ఉపాధి మార్గాలను కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి: సారా తయారీ కుటుంబాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు డీఆర్డీఏ / ఉపాధి హామీ పథకం ద్వారా డ్రైవింగ్, టైలరింగ్, కంప్యూటర్స్ వంటి కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పిల్లల చదువులకు భరోసా: ఈ కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు కోసం గురుకుల పాఠశాలల్లో (రెసిడెంటిల్ స్కూల్స్ ) సీట్లు ఇప్పించి, వారి ఉన్నత చదువులకు, పోటీ పరీక్షలకు (కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ) మెటీరియల్స్ అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆరోగ్యం మరియు సంక్షేమం: నాటుసారా మహమ్మారి వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు.