వత్సవాయి పోలీసు స్టేషన్‌లో ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం రోజుకో 20 నిమిషాల యోగా!

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం, జూన్ 8 వాత్సవాయి గ్రామంలోని ఈ రోజు నవత్సవాయి పోలీస్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా, వత్సవాయి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక యోగా శిక్షణ ఎస్సై ఉమామహేశ్వరరావు నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బందికి ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా యోగాసనాలు, ప్రాణాయామం చేయిస్తున్నారు. ఈ యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత లభించి,విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించవచ్చని స్థానిక ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *