గ్రామాల సమగ్రాభివృద్ధికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు :సర్పంచ్ దున్నా శ్రీనివాస్.

జనం న్యూస్ జూన్ 7 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం) గ్రామాల సమగ్రాభివృద్ధికే తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందని నడిగూడెం గ్రామ సర్పంచ్ దున్నా శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నడిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదిక నందు నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ సోమపంగు సూరయ్య, ఎంపీడీవో మల్సూర్ నాయక్, ఎస్సై అజయ్ కుమార్, గ్రిడ్ డిఇ అభినయ్, ఏపీఓ శ్రీనివాసరావు గ్రిడ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు అభిలాష్,సతీష్,పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, వార్డు సభ్యులు దున్న శ్రీకాంత్, దున్న లింగయ్య, పోలేబోయిన విజయ నాగరాజు, నాగారపు సరస్వతి రాము, బాణాల సతీష్ కుమార్, గుండు మహేందర్ ప్రసాద్, కాసాని మాధవి , షేక్ నాజియా రియాజ్, వైద్యశాల సూపర్డెంట్ విద్యాసాగర్, ఆర్ ఐ మల్సూర్,ఏఈఓ వెంకటరెడ్డి,బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కరుణ, ఏ ఎల్ ఎం ఎల్లయ్య,ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ,గ్రామ పెద్దలు పందిరి వెంకటరెడ్డి,ఎలక రామిరెడ్డి,పందిరి శ్రీనివాస్ రెడ్డి,షేక్ జలీల్,ఎలక సంజీవరెడ్డి,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్త లు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *