పట్టాదారు పాస్ పుస్తకాలు పంపీణీచేసినమంత్రి సంధ్యారాణి

జనం న్యూస్, మన్యం జిల్లా, సాలూరు, జూన్ 7. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత భూసంస్కరణలో ఉన్న లోపాలను సరి చేయుటకు ప్రభుత్వము రాష్ట్ర మొత్తం మీద, మండలాలు భారీగా రీ సర్వే చేయించి రైతులకు తమ భూమిపై శాశ్వత హక్కును కలిగించుటకు భూములను రీ సర్వే చేసి రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించుటకు నిర్ణయించి భూములను సర్వే చేయించి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతున్నది. అందులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి సాలూరు మండలంలోని, సారిక పంచాయితీ, ములకాయవల గ్రామంలో గిరిజన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సంధ్యారాణి కి ఆ గ్రామ ప్రజలు తొలుత బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. గిరిజన మహిళలు దింసా నృత్యంతో తమ అభిమాన ఆడపడుచుకు స్వాగతం పలికారు. మంత్రి సంధ్యారాణి కూడా వారితో చేతులు కలిపి దింసా నృత్యం చేశారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మొదటి విడత కింద ఆ గ్రామానికి చెందిన 90 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలకమని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో రైతులకు భూ హక్కుల పరిరక్షణ కొరకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అని తెలియజేశారు అర్హులైన రైతులందరికీ భూ సంబంధిత సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *