పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్‌వారు ఘనంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం రోజుకో 20 నిమిషాల యోగా!

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం, జూన్ 8 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజు న పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా, పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక యోగా శిక్షణ ఎస్ ఐ కే అర్జున్ నిర్వహించారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బందికి ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా యోగాసనాలు, ప్రాణాయామం చేయిస్తున్నారు. ఈ యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత లభించి,విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించవచ్చని స్థానిక ఎస్సై కే.అర్జున్ తెలిపారు. ఈకార్యక్రమంలో పోలిస్ స్టేషన్ సిబ్బంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *