పయనించే సూర్యుడు జూన్ 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ తమ పంట పొలంలోకి అక్రమంగా ప్రవేశించి తన పైన తన కుటుంబం పైన దాడికి పాల్పడిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి ఆదివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మండల పరిధిలోని వట్టెం గ్రామపంచాయతీ పరిధిలో గల కల్వకుంట తండాకు చెందిన పాత్యావత్ లక్ష్మణ్ నాయక్ జాతృ అనే వ్యక్తులు వట్టెం శివారులోని 123 సర్వే నెంబర్లు 39 గుంటల భూమి తమ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నదని అట్టి భూమిలో గత రెండు సంవత్సరాలుగా వారే మోక మీద ఉంటూ పంటను సాగు చేశారని ఇదే క్రమంలో శనివారం ఉదయం తమ పొలంలో పత్తి విత్తనాలను నాటుతున్న క్రమంలో తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించిన పాత్యావత్ రాజు పాత్యావత్ రవి అదేవిధంగా శత్రు అనే ముగ్గురు వ్యక్తులు అకారణంగా మా పంట విత్తనాలను ధ్వంసం చేసి మాపై దాడి చేసినారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు రాజు అనే వ్యక్తి రైస్ మిల్లు నిర్మాణం చేస్తున్నాడని రైస్ మిల్లుకు అడ్డుగా తన పొలం వస్తుందని ఎలాగైనా తన పొలాన్ని లాక్కోవాలని దురుద్దేశంతో మాపై దుర్గ ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడ్డాడని బాధితుడు వాపోయాడు గ్రామ పెద్దల సమక్షంలో మాకు భూమిని కొలిచిహద్దులు ఏర్పాటు చేసి ఇచ్చిన భూమిలోనే సాగు చేసుకుంటున్నామని అద్దురాలను సైతం దౌర్జన్యంగా కూలగొట్టి మాపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు