సంక్షేమ పథకాల అమలు బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదే

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ల జాతీయ సమావేశంలో డాక్టర్ కవ్వంపల్లి.

పయనించే సూర్యుడు న్యూస్ :మే /26:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పెళ్లి సత్యనారాయణ మాట్లాడుతూ. కాంగ్రెస్సేతర రాష్ట్రాల్లో దళితులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని, ఆ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో ఏఐసీసీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్ అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్ పర్సన్ల జాతీయస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఎస్సీలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలను కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్సేతర రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల దళితులకు అన్యాయం జరుగుతున్నదని, ఈ దృష్ట్యా ఆయా పథకాల అమలు బాధ్యత నూటికి నూరు పాళ్లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేని డాక్టర్ కవ్వంపల్లి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మూల సూత్రాలని ఆయన గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సమన్వయంతో పనిచేయాలని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎస్సీ సెల్ నాయకులు కీలక పాత్ర పోషించాలని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఎస్సీ సెల్‌ను గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *