“అడుగు వెనక్కి పడదు.. ఆశయం వీడదు!

* ప్రజా సేవలో యువనేత సంకా హరీష్

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 9 వత్సవాయి మరియు జగ్గయ్యపేటఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల సమస్యపై ఎన్ హెచ్ ఆర్ సి స్పందించింది. 29 కేంద్రాల్లో 25 కేంద్రాలు సిబ్బంది, సౌకర్యాల కొరతతో పనిచేయకపోవడంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఎన్ హెచ్ ఆర్ సి, రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు ప్రతిని పంపించి, సంబంధిత అంశాలపై అవసరమైన చర్యలు తీసుకుని 4 వారాల్లోగా చర్యలు తీసుకున్న రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.ఈ విజయానికి పెద్ద ఎత్తున అభినందనలు తెలిపిన ప్రజలకు మన యువనేత సంకా హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. మా తాత ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సంకా జనార్ధన రావు అన్యాయంపై పోరాడే స్ఫూర్తి నాకు వారివల్లే వచ్చింది.ఎలాంటి అడ్డంకులు ఎదురైనా,చట్టాల పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తానని యువనేత సంకా హరీష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *