కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్లు – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలారు

* మహిళలపై దాడులు, అక్రమ కేసులు, రైతులను ఆదుకోవడంలో వైఫల్యంపై రౌండ్ టేబుల్ సమావేశం * జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు _

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా/జగ్గయ్యపేట నియోజకవర్గం జూన్ 09-06-2026 సోమవారం జగ్గయ్యపేట పట్టణం ఆర్టీసీ డిపో దగ్గర ఎలక్ట్రికల్ యూనియన్ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగు రౌండ్ టేబుల్ కార్యక్రమం పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ అధ్యక్షతన జరుగు కార్యక్రమంలో వామపక్ష నాయకులు పలు కార్మిక సంఘాలు, బీసీ సంఘ నాయకులు, పలూ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్న ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు విమర్శించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో మహిళలు, రైతులు, యువత, పేదల అభ్యున్నతే లక్ష్యమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు పెరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో, పంట నష్టాలకు తగిన పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న రోజుల్లో ప్రజల సమస్యలపై మరింతగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలో పరిపాలన విధానంలో గాని, అభివృద్ధి విధానంలో గాని పూర్తిగా విఫలం అయింది, అభివృద్ధి సంక్షేమమైన పథకాలు అడిగితే ఒక అమరావతి చూపించి పబ్బం గడుపుతున్న చంద్రబాబు. మెగా డీఎస్సీ కాదు దగాడిఎస్సి తీవ్రంగా ఖండించారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం చేస్తాం. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జగ్గయ్యపేట నియోజకవర్గ పార్టీ కార్యదర్శి అంబోజి శివాజీ , బీసీ ఉద్యమ నాయకులు తుమ్మాటి కృష్ణమాచార్యులు , ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు నంబూరు చలపతిరావు , కాంగా వెంకటేశ్వరరావు దర్శి వెంకటేశ్వర్లు, పట్టణ వైస్ చైర్మన్ హఫీజున్నిసా, సీనియర్ నాయకులు బూడిద నరసింహారావు, చల్లా వైకుంఠ రావు, మండల శ్రీనివాస్ గౌడ్, చింతకుంట్ల వెంకటరెడ్డి, బత్తుల రామారావు, కన్నమాల శ్యామల్, పెంటి శ్రీనివాసరావు, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, నంబూరి రవి, శివరాత్రి పృద్వి, దర్శనాల వెంకటరమణ, ఆదోరి సుజాత, చల్లా సుశీల, మాతంగి నాగబాబు, గొర్రెపాటి బుల్లయ్య, బజార్ సాయి, శీలం మంగారావు, నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *