​భగభగమండే ఎండల్లో బాటసారుల దాహార్తిని తీర్చడం కన్నా మిన్నైన సేవ లేదు…

పయనించే సూర్యుడు వాత్సవాయి మండలం రిపోర్టర్ తమ్మిశెట్టి వెంకట్రావు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గంజూన్ 12 వాత్సవాయి గ్రామంలోని ఈరోజున వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ప్రజా నాయకులు దారెల్లి చిరంజీవి ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు ​తెలంగాణ రాష్ట్రం, బోనకల్లు మండల కేంద్రంలో ఎండల తీవ్రతను దృష్ట్యా ప్రజల కోసం “సాయి కృష్ణ సెల్ పాయింట్” వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత చలివేంద్రం ముగింపు కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ​ఈ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ప్రజా నాయకులు దారెల్లి చిరంజీవి పాల్గొన్నారు… ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజల ఇబ్బందులను గమనించి, బాటసారుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సాయి కృష్ణ సెల్ పాయింట్ నిర్వాహకులను మరియు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించారు… సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని, తోటివారికి సహాయం చేయడంలోనే నిజమైన తృప్తి ఉందని కొనియాడారు.. ​ఈ ముగింపు కార్యక్రమంలో చలివేంద్ర నిర్వాహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *