రైతాంగానికి ప్రభుత్వం అవగాహన కల్పించాలి

* రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందించాలి * సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 13 సాలుర: సాలూరు మండల కేంద్రంలో సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా విత్తనాలు ఎరువులు పురుగు మందులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా సదుపాయం కల్పించాలని అన్నారు డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ ప్రకటిస్తున్నందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల సాగు పై రైతాంగానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు అభిప్రాయపడ్డారు బోధన్ డివిజన్ ప్రాంతంలో కూడా రైతాంగం అలవాటు ప్రకారం ఎప్పటి మాదిరిగా పండించే పంటలకే మొగ్గు చూపుతున్నారని కానీ వాతావరణ నిపుణులు చెబుతున్నట్లు ఎల్నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడకపోతే రైతాంగం భారీగా నష్టపోయే అవకాశం ఉంటుందని కాబట్టి ఈ విషయం పై రైతాంగానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ ఏ పంటలను వేయాలో తెలియజేస్తూ విత్తనాలు ఎరువులు పురుగుమందులు ప్రభుత్వమే రైతాంగానికి సప్లై చేయాలని రైతాంగం పండించిన పంటలను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని బి.మల్లేష్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. దేవయ్య రమేష్ లక్ష్మయ్య, నాగేష్ లక్ష్మణ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *