రానున్న ఎనకల్లో ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే నానాజీ పిలుపు..

పయనించే సూర్యుడు జూన్ 13, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం ప్రజ్ఞా ఫంక్షన్ హాల్లో తిమ్మాపురం జనసేన గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నానాజీ రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఒటర్లను పరిశీలన మరియు ఒటర్లను తమ పార్టీకి అనుకూలంగా చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రతి ఇంటింటికి వెళ్లాలని సూచించారు. గత 2002లో ఈ సర్వే జరిగిందని మరల 24 సంవత్సరాల తర్వాత జరిగే సర్వేలో జరిగే సర్వేలో ఓటర్లను గుర్తించి పూర్తిస్థాయిలో జాబితాను తయారు చేయవలసి ఉందని తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా ఒటర్ జాబితాలో వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. వారు సక్రమంగా ఉంటేనే నాయకులు పదవులను అనుభవించడానికి దోహద పడుతుందని తెలిపారు. అనంతరం జనసేన గ్రామ బత్తుల దొరబాబు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి, యువ నాయకుడు పంతం సందీప్, రాష్ట్ర ఖాదీ పరిశ్రమ డైరెక్టర్ సిరంగి శ్రీనివాస్, బూత్ లెవెల్ ఏజెంట్లు, జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *