3వ ఏషియన్ ఆత్యా-పత్యా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు రామావత్ ప్రకాష్,నేనావత్ బిందు గార్లకు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అభినందనలు

పయనించేసూర్యుడు. న్యూస్14. జూన్.పుల్కల్ మండలప్రతినిధిపెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి. జిల్లా. పుల్కల్ భూటాన్‌లో ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన 3వ ఏషియన్ ఆత్యా-పత్యా చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి స్వర్ణ పతకాలు సాధించిన పుల్కల్ మండలపరిదిలొని లాల్ సింగ్ నాయక్ తండాకు చెందిన రామావత్ ప్రకాష్, దాసుగడ్డ తండాకు చెందిన నేనావత్ బిందును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అభినందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచిన ఈ క్రీడాకారులు భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాలుర విభాగంలో రామావత్ ప్రకాష్, బాలికల విభాగంలో నేనావత్ బిందు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి స్వర్ణ పతకాలు సాధించడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన ఈ క్రీడాకారులు తెలంగాణలో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషమన్నారు. వారి విజయంతో క్రీడా వర్గాలు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం అందోల్ నియోజకవర్గ అధ్యక్షుడు దినేష్ నాయక్‌తో పాటు అజయ్, హరీ, కిరణ్, ప్రవీణ్, తుకారం, సురేష్, విష్ణు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *