భక్తిశ్రద్ధలతో అధిక మాస వాయనాల కార్యక్రమం ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో

* 32 మంది బ్రాహ్మణ దంపతులకు అధిక వాయనాల సమర్పణ * వేదమంత్రాల నడుమ ఆశీర్వచనాలు అన్నప్రసాద వితరణ

పయనించే సూర్యుడు జూన్ 14 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్ ) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో అధిక వాయనాల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వాయనాలు సమర్పించారు సంఘం అధ్యక్షురాలు రాగం అర్చన ప్రధాన కార్యదర్శి సంధ్య కోశాధికారి దాదిగారి వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 32 మంది బ్రాహ్మణ దంపతులకు అధిక వాయనాలు అందజేశారు ఈ సందర్భంగా స్థానిక బ్రాహ్మణులు రాయల కృష్ణశర్మ మహేష్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ ప్రత్యేక ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు పాల్గొన్న బ్రాహ్మణ దంపతులు ఆర్యవైశ్య కుటుంబాలను ఆశీర్వదించారు అనంతరం బ్రాహ్మణులతో పాటు ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా సాగింది ఆర్యవైశ్య మహిళలు సంఘ ప్రతినిధులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *