ట్రాఫిక్ రహిత సమాజం కోసంరాజీ లేని కృషి చేస్తాం:పిఏసిఅరెక పూడి గాంధీ

పయనించే సూర్యుడు జూన్ 15 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉష ముళ్ళపూడి కమాన్ నుండి గాజులరా మరం వరకు చేపడుతున్న వయా ఎల్ల మ్మబండ ప్రధాన రహదారిలో జరు గుతున్న 100 ఫీట్ రోడ్డు విస్తరణ పను లను తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పరిశీలించిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా పిఏసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వెళ్లే రోడ్డు వ యా ఎల్లమ్మబండ రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడు తున్నారు అని ,ట్రాఫిక్ సమస్య పరిష్కా రానికై 100 ఫీట్ రోడ్డు విస్తరణ చేపట్ట డం జరిగినది అని ,దానిలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల పై గతంలో అధికారులతో కలిసి ఉషముళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తీ వరకు పాదయాత్రగా స్వయంగా నడు చుకుంటూ వెళ్లడం జరిగిన సంగతి విదితమే అని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియచేసారు.100 ఫీట్ రోడ్డు విస్తర ణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి, ప్రణాళిక ను రూపొందించి రోడ్డు విస్త రణ పనులు వెంటనే చేపట్టి త్వరితగ తి న పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకువస్తామని, రోడ్డు మధ్యలో వచ్చిన బండ రాళ్ళ ను తొలగించడం జరుగుతుంది అని,రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల ను తొలగించడం జరిగినది అని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఉషము ళ్ళపూడి కమాన్ నుండి సిక్కుల బస్తి వరకు ఎల్లమ్మ బండ రోడ్డు విస్తర ణలో భాగంగా రోడ్డు పక్కన గల విద్యుత్ స్థంబాలను స్థాన భ్రంశం చేపట్టడం జరి గినది అని అన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత,సు ఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తు ల కృషి చేస్తానని, ప్రజలకు రోడ్డు ఎంత గానో ఉప యోగపడుతుంది అని పిఎసి చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. 100 ఫీట్ రోడ్డు విస్తరణపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిన ది అని,ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరి ష్కరిస్తానని పిఎసి చైర్మన్ గాంధీ తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *