పయనించే సూర్యడు జూన్ 02 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు రత్నవరం తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రత్నవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వరాష్ట్రంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.