పయనించే సూర్యడు జూన్ 02 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా కోదాడ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. గతంలో లాకప్ మరణానికి గురైన కర్ల రాజేష్ కుటుంబానికి అండగా నిలవాలని భావించి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి అండగా ఉండాలని రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కర్ల రాజేష్ తల్లిగారు కర్ల లలితమ్మకు రూ.5 లక్షల చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి మా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తు, కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని బాధిత కుటుంబానికి అవసరమైన సమయంలో అండగా నిలవడం మా సామాజిక బాధ్యతగా భావిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ సహాయాన్ని అందించడం ద్వారా బాధిత కుటుంబానికి కొంతైనా భరోసా కలుగుతుందని ఆశిస్తూ ప్రజల హక్కుల కోసం, బాధితుల పక్షాన నిలబడటం బీఆర్ఎస్ పార్టీ విధానం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై మా పోరాటం కొనసాగుతుందనీ కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాననీ . కర్ల రాజేష్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థిస్తున్నాము అని తెలియజేశారు