సీతారామ ప్రాజెక్టు ద్వారా బేతపల్లి చెరువుకు నీరు మళ్ళించే కార్యక్రమం

పయనించే సూర్యుడు : జూన్: 4/ 26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా కొమ్ముగూడెం వెంకన్న చెరువును నింపి అక్కడనుండి కాలువ ద్వారా బేతుపల్లి చెరువు నీటిని నింపటానికి గత కొద్ది నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ కాలువ కార్యక్రమం కు కొమ్ముగూడెం, రుద్రాక్ష పల్లి సంబంధిత రైతులు అభ్యంతరాలు చెప్పడం జరిగింది, కొంతమంది రైతులు కాలువ అసలు వద్దని సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కి తెలియజేయగా రైతుల సమస్యల పరిష్కారం కోసం, సీతారామ ప్రాజెక్ట్ కాలువ ద్వారా బేతుపల్లి చెరువు నింపే ప్రయత్నం కొరకు ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తో, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో, సత్తుపల్లి ఎమ్మార్వో తో, ఇరిగేషన్ అధికారులతో స్వయంగా రైతులతో చర్చించి, అధికారంతో మాట్లాడి రైతులందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ రైతుల సమస్యలను నేరుగా వచ్చి స్వయంగా పరిశీలించి రైతులు పక్షాన నిలబడి పోరాడి రైతులందరూ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని అధికారులను ఒప్పించి మంచి నిర్ణయాన్ని ప్రకటించి చెరువు నుండి కాల ద్వారా బేతపల్లి చెరువుకు నీరు వెళ్లే విధంగా కార్యక్రమాన్ని ప్రకటించిన దయానంద్ కి రుద్రాక్ష పల్లి గ్రామ ప్రజలు, పంచాయతీ రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *