పయనించే సూర్యుడు జూన్ 04 ,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండల తహశీల్దార్ బాబ్జీ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన చెక్కులను మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తహశీల్దార్ బాబ్జీ ప్రసాద్‌తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అంబటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, ఉచిత గృహ విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా సుమారు రూ.30 వేల వరకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం, చేయూత, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర సంక్షేమ కార్యక్రమాలు పేద, మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చుంచు శ్రీనివాసరావు, మత్కేపల్లి సర్పంచ్ కంచం ద్రౌపది, గాంధీనగర్ సర్పంచ్ ఓర్సు వీరభద్రం, పాతర్లపాడు సర్పంచ్ ఓబినబోయిన లక్ష్మి, జిల్లా ఆత్మ కమిటీ సభ్యుడు కొప్పుల గోవిందరావు, మార్కెట్ డైరెక్టర్ బందెల నాగార్జున, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్, గాంధీనగర్ ఉప సర్పంచ్ ఒంగురి రమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కంచుమర్తి రామకృష్ణ, సేవాదళ్ అధ్యక్షుడు పర్సగాని సతీష్, గ్రామ శాఖ అధ్యక్షుడు పగడాల రాధాకృష్ణ, కంచం కోటేశ్వరావు, కాంగ్రెస్ నాయకులు బొల్లికొండ రామారావు, తాళ్లూరి రమేష్, ఆర్‌ఐ ఏకవీర, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.