అమరవీరుల త్యాగాల ఫలితమే..తెలంగాణ అవతరణం:దొడ్ల వెంకటేష్ గౌడ్

పయనించే సూర్యుడు, జూన్ 03 రంగారెడ్డిప్రతినిధి ఎస్ఎంకుమార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభసంద ర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొ రేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆశా నగర్ కాలనీ లోని కాం గ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఇంద్రహిల్స్ కాలనీ వెల్ ఫెయిర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యక ర్తలు, మహిళా నాయకురాళ్లతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ కార్పొ రేటర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాట ఫలితంగా తెలం గాణ రాష్ట్రం అవతరించిందని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులందరికి ని వాళులు అర్పించారు. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యక ర్తలు, మహిళా నాయకురాళ్లు, ఉద్యమకారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *