రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ను

కలిసిన ఆదోని జిల్లా సాధన మరియు అభ్యర్థి కమిటీ.

పయనించే సూర్యుడు జూన్ 16 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఉదయం కర్నూలు జిల్లా అదితి గృహములో రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కి ఆదోని జిల్లా సాధన మరియు అభ్యర్థి కమిటీ ఆధ్వర్యంలో తాగునీరు సాగునీరు మరియు నీటి ప్రాజెక్టుల అంశాలపై నిధులను మంజూరు చేసి వేదవతి ‘ గురు రాఘవేంద్ర రాఘవేంద్ర గుండ్రేవుల ఆర్డిఎస్ మొదలగు ప్రాజెక్టులకు నగర డోనరిజర్వాయర్ తొందరగా నిధులను మంజూరు చేసి ప్రారంభించవలసినదిగా కోరడమైనది వేదవతి ప్రాజెక్టు పర్యావరణ అనుమతి కోరుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం త్వరలో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని మరొకసారి కర్నూలు జిల్లా ఇన్చార్జి మినిస్టర్ నిమ్మల రామానాయుడు ని కోరడమైనది ఈరోజు మంత్రి ని కలసి వినతి పత్రం అందజేసిన వారిలో కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు కృష్ణమ్మ బిజెపి జిల్లా అధ్యక్షులు రామకృష్ణ బిజెపి సీనియర్ నాయకులు విట్టా రమేష్ ఆదోని జిల్లా సాధన మరియు అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ రఘు రామయ్య ట్రెజరర్ కృష్ణమూర్తి జాయింట్ సెక్రెటరీ కమతం వెంకటేష్ ఈసీ మెంబర్ హనుమంతరావు కలసి వినతి పత్రాన్ని సమర్పించడం అయినది మంత్రి సానుకూలంగా స్పందించడం అయినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *