జిగిత్యాల జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యునిగా గిన్నెల శ్రీకాంత్ చారి

పయనించే సూర్యుడు,కోరుట్ల జూన్ 16. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వై అనూప్ రావు నివాసంలో జరిగిన కార్యక్రమంలో కోరుట్ల కి చెందిన బీజేపీ నాయకుడు గిన్నెల శ్రీకాంత్ చారి ని బీజేపీ జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమిస్తూ నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ గిన్నెల శ్రీకాంత్ చారి బీజేపీ సీనియర్ నాయకుడు పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ కోరుట్ల పట్టణ బీజేపీ లో అత్యంత అక్టివ్ గా పార్టీకి సేవాలాందించాలని కోరుకుంటున్నా. గిన్నెల శ్రీకాంత్ చారి మాట్లాడుతూ నాపై నమ్మకంతో జగిత్యాల జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యునిగా నా నియామకానికి సహకరించిన మన ఇందూరు పార్లమెంట్ సభ్యడు ధర్మపురి అర్వింద్ కి అలాగే జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు కి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై అనూప్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్, జిల్లా ఉపాధ్యక్షుడు తుక్కారం గౌడ్ రాష్ట్ర నాయకుడు ఏలేటి నరేందర్ రెడ్డి రాష్ట్ర నాయకుడు రుద్ర శ్రీనివాస్ జగిత్యాల జిల్లా కార్యదర్శి సుదవేణి మహేష్ కి బీజేపీ బీజేవైఎం నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు ఇట్టి కార్యక్రమం లో కోరుట్ల బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపెల్లి సాగర్,ఎర్ర రాజేందర్,మ్యాకల గణేష్, గందే నవీన్, మాడవేణి నరేష్ కోరుట్ల మండల అధ్యక్షుడు అంబల్ల సుదర్శన్,సంకు నరేందర్,బోలిశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *