భట్టి విక్రమార్క జన్మదినోత్సవం సందర్భంగా చింతకానిలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు జూన్ 16, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆశ్రయ సేవా సొసైటీ సహకారంతో సోమవారం ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పువ్వాళ దుర్గాప్రసాద్, అంబటి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కంచమర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అలాగే తలసేమియా బాధిత పిల్లల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరంతో పాటు ఉచిత కంటి పరీక్షల శిబిరం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కొత్త జీవితం అందించే గొప్ప సేవ అని పేర్కొన్నారు. యువత సేవా దృక్పథంతో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. అనంతరం భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తదుపరి ఆవుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, జోన్ ఇన్‌చార్జీలు, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *