రెండేళ్ల పాలన పూర్తి చేసిన కూటమి.. సోమశిలలో సంబరాల సందడి

పయనించే సూర్యుడు న్యూస్ : జూన్ 16 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కూటమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ బస్టాండ్ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు ముక్కు పుల్లయ్య గౌడ్, జనసేన నాయకుడు ఎం. కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని వ్యాపార సంస్థలు, అంగడుల వద్దకు వెళ్లి స్వీట్లు పంచిపెట్టారు. టపాసుల మోతలతో బస్టాండ్ సెంటర్ సందడిగా మారగా, కార్యకర్తలు “జై చంద్రబాబు”, “జై పవన్ కళ్యాణ్”, “జై నరేంద్ర మోదీ”, “జై తెలుగుదేశం”, “జై జనసేన”, “జై బీజేపీ” నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బొర్రా బాబు, మండల టీడీపీ సీనియర్ నాయకుడు గువ్వల పెంచలయ్య, గ్రామ టీడీపీ ఉపాధ్యక్షుడు జంజం నారాయణ, మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ రహమాన్, తెలుగు నాడు అధ్యక్షుడు పోకల శ్రీనివాసుల రెడ్డి, నాయకులు ముక్కు నాగరత్నం గౌడ్, సోమిశెట్టి సుబ్బారావు, బీఎల్‌ఏ పరుచూరు మల్లెం కొండయ్య, మైనార్టీ నాయకుడు గౌస్ బాషా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *