పయనించే సూర్యుడు, జులై 7, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బచ్చన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలంలోని పలు పాఠశాలను సభ్యత్వ నమోదులో భాగంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సమస్యలను జిల్లా అధ్యక్షులు చల్లా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్ డి ఏ మరియు పిఆర్సిలను ప్రకటించకుండా ఉపాధ్యాయులను అపహస్యం చేసేలా మధ్యాహ్న భోజనం టిఫిన్ ఉపాధ్యాయులకు ఉచితంగా అందిస్తున్నట్లు కేబినెట్లో ప్రకటించడం ఉపాధ్యాయులను అవమానపరచడమేనని అన్నారు. ఉపాధ్యాయులను మభ్యపెట్టడానికి ఇట్టి నిర్ణయాలని ఏదో ఒక సమస్యను సృష్టించి ఉపాధ్యాయులను అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రభుత్వం ఈ విధంగా సమాజంలో ఉపాధ్యాయుల యొక్క ఔన్నత్యాన్ని చులకన చేసే విధంగా ప్రవర్తించడం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం సతీష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మేలు చేకూరే విధంగా టెట్ పరీక్షను కట్ ఆఫ్ క్వాలిఫై మార్కులను తగ్గించాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు పృథ్వీరాజ్ ఉపాధ్యాయులు మారుతున్న పరిస్థితులకు కనుగుణంగా జాతీయ భావజాలం గల సంఘంలో చేరి తపస్ సంఘాన్ని బలపరచాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు ముసిని వేణుగోపాల్ మండల ప్రధాన కార్యదర్శి పాలకుర్తి నవీన్ మండల బాధ్యుల అశోక్ విష్ణుకుమార్ శ్రీనివాస్ రఘు మూర్తి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.