పయనించే సూర్యుడు న్యూస్, జూలై 08 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏలేశ్వరం పట్టణంలోని వృద్ధులకు భిక్షాటన చేసేవారికి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు అనంతరపు రాజు ఆర్థిక సాయంతో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 40 మంది కి ఆహార పొట్లాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంతరపు రాజు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి ఏలేశ్వరం పట్టణ ఇన్చార్జ్ పెండ్యాల రాజు, కొల్లి ఏసుబాబు, ఇప్పర్తి వెంకన్న, చాలగాల మన్నియ్య, కొల్లి నాగు, తుమ్మలపల్లి పండు, కొల్లి పండు, మిరియాల రమేష్, కాకాడ దొర, వంగలపూడి చందర్రావు, చిక్కాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
.
