పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూలై 05.07.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// ఎల్ నీనో ప్రభావం పై మండల వ్యవసాయ శాఖ అధికారి మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మోహన్ కుమార్ ప్రసంగిస్తూ ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతుందన్నారు వడగాలులు ఎక్కువగా ఉంటాయన్నారు దీనిని ఎదుర్కోవడానికి వరి సాగుకు బదులుగా తక్కువ కాలంలో పండే,బెట్ట పరిస్థితులను ఎదుర్కొనే జొన్న, సజ్జ, రాగులు లాంటి పంటలను సాగు చేసుకోవాలన్నారు . ఫ్రీ మన్సూన్ డ్రై సోయింగ్ వర్షాలకు ఒకటి రెండు వారాల ముందే పొడి నేలలో విత్తనాలు నాటడం వల్ల వేర్లు బలంగా పెరిగి బెట్టను తట్టుకుంటాయన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టి రైతులకు 50% సబ్సిడీ కింద కంది విత్తనాలు అందజేయడం జరిగిందన్నారు బోరు బావులు కలిగిన రైతులు డ్రిప్ ఇరిగేషన్ ప్రభుత్వం ఇచ్చే రాయితీతో డ్రిప్పు పరికరాలు అమర్చుకొని తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకోవచ్చని అధిక దిగుబడి పొందవచ్చని తెలియజేశారు. ర్యాలీలో వ్యవసాయ డి ఆర్ డి ఏ ఏపిఎం సుబ్రమణ్యం సంఘమిత్ర సభ్యులు రైతులు పాల్గొన్నారు.