పయనించే సూర్యుడు జులై 05 (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు, సూపర్వైజర్లు, కార్యకర్తలు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయించేలా కృషి చేయాలని చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక & విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆయన ఈ సూచనలు చేశారు. ఈ నెల 28వ తేదీలోపు తమ తమ పరిధిలోని ప్రతి అర్హ ఓటరు వివరాలు తప్పనిసరిగా నమోదు అయ్యేలా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు నింపించి, వాటిని సంబంధిత బీఎల్ఓలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం కావడంతో ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలో ఉండే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక్క అర్హ ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని గోపి యాదవ్ కోరారు.