ఓటరుజాబితా సవరణ ప్రక్రియలో100 శాతం డిజిటలైజేషన్ మన లక్ష్యం

ఏపీ ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూలై 8 ఎస్ ఐ ఆర్ సమస్యలపై బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ ఏపీ ప్రజాసంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య ఆధ్వర్యంలో గూడూరు ఆర్డీవో అరుణ కుమారికి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి బూతులోనూ 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయడమే మన లక్ష్యం కావాలన్నారు. గూడూరు నియోజకవర్గంలో అతి తక్కువ డిజిటలైజేషన్ శాతం నమోదయినట్లు జిల్లా అధికారులు ప్రకటించారని, దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిజమైన ఓటర్లుగా ఉన్న ఓటర్లు అందరూ, ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తమ వంతు ప్రత్యేక దృష్టి సాధించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎల్.వి సుబ్బయ్య, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *