పయనించే సూర్యుడు న్యూస్ జులై 8 సాలూర: సాలూర మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్న జన్మదిన వేడుకలను దండోర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ అధ్యక్షులు ధమ్మన్ గావ్ సుభాష్ దండోరా జెండా ఆవిష్కరించారు. అనంతరం బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి నివాళులు అర్పించి సామాజిక ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ అన్న జన్మదినం సంధర్బంగ కేక్ కట్ చేశారు.ఈ సంధర్బంగ స్వీట్లు పంపిణీ చేసి మందకృష్ణ మాదిగ అన్నకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సొక్కం రవి, ఇల్తెపు శంకర్, గడ్డం గంగులు,కేజీ గంగారాం, ఎమ్మార్పీఎస్ సీనియర్ జిల్లా నాయకులు లింబూరి లక్ష్మణ్ రమేష్ స్థానిక నాయకులు లింబయ్య లాలయ్య చంటి సాయిలు సంతోష్ చాందు రవి మరయ్య పీరయ్య పోశేట్టి హరి తదితరులు పాల్గొన్నారు.