పయనించే సూర్యుడు మే 20 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :శంకరపట్నం మండల కేంద్రంలో కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా సీపీఎం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ సుందరయ్య సీపీఎం తొలి రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, పార్లమెంట్ ఎంపీగా పలు కీలక పదవులు నిర్వహించారని గుర్తుచేశారు. పార్లమెంట్ సమావేశాలకు సైకిల్‌పై హాజరైన నిరాడంబర నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెల్మారెడ్డి రాజిరెడ్డి, మండల కమిటీ సభ్యులు చక్రపాణి, విజయరాములు, వంగ బిక్షపతి, సత్యం, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు