జహీరాబాద్‌లో ప్రధాని విశ్వకర్మ యోజన కిట్ల పంపిణీ

పయనించే సూర్యుడు, మే 20 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా మంజూరు చేసిన రూ. 15,000 విలువైన టూల్ కిట్లను జహీరాబాద్‌లో పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పోస్టు ద్వారా పంపించిన ఈ కిట్లను, పట్టణ బీజేపీ అధ్యక్షుడు పూల సంతోష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు సుధీర్ బండారి, మున్సిపల్ కౌన్సిలర్లు బొగ్గుల సంతోష్, అప్పం శ్రవణ్, జిల్లా నాయకుడు సురేష్ పూరి, మహిళా నాయకురాలు స్వప్న మరియు పథకం లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *