పయనించే సూర్యుడు న్యూస్, జూలై 08 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అని వైఎస్సార్సీపీ నాయకుడు, ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణం రాజు అన్నారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన గొర్ల రాజబాబు భార్య బేబీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చేతికి తీవ్ర గాయాలపాలైంది. విషయం తెలుసుకున్న ముదునూరి మురళీకృష్ణం రాజు మంగళవారం వారి నివాసానికి వెళ్లి బేబీని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. చికిత్సకు అవసరమైన సహాయం అందించాలని సూచిస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం కుటుంబానికి రూ.5,000 నగదు ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా తాను అండగా ఉంటానని, అవసరమైన సమయంలో అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు తోడుగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముదునూరి మురళీకృష్ణం రాజు అందించిన ఆర్థిక సహాయానికి గొర్ల రాజబాబు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల ఉపాధ్యక్షుడు కిల్లాడి బాబ్జి, కోలా తాతబాబు, కోన బాబ్జి, కేసరపు శ్రీను, గోనగాని రామకృష్ణ, నల్ల వెంకటేష్, దోమలంక బాబ్జి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.