కాలసాని శేషుకు నివాళులర్పించిన అన్నారుగూడెం ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కేవీ), పొన్నం కృష్ణయ్య..

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 9, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన గుమ్మా వలరాజు అల్లుడు కాలసాని శేషు ఇటీవల మృతి చెందారు. ఆయన దశదినకర్మ సోమవారం తిరువూరు మండలం కంభంపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నారుగూడెం గ్రామ ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కెవి), సీనియర్ నాయకులు పొన్నం కృష్ణయ్య హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల గోపి గౌడ్, మద్దిబోయిన వేలాద్రి, గుమ్మా హరి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *