ఘనంగా దివంగత నేత వంగవీటి మోహనరంగా 79వ జయంతి…

పయనించే సూర్యుడు జూలై5, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్ లో గల అన్న క్యాంటీన్ వద్ద సుమారు 600 మందికి ఉన్న సందర్భంలో కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాధా-రంగ మిత్ర మండలి అధ్యక్షులు సలాది శ్రీనివాస బాబు మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. అందులో భాగంగా వంగవీటి మోహన రంగా జయంతిని నిర్వహించారు. ముందుగా వంగవీటి మోహన రంగా ఫ్లెక్సీ దగ్గర నివాళులర్పించి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని రాధా-రంగ మిత్రమండలి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సలాది శ్రీనివాస బాబు ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా అందరికీ భోజనాలు వడ్డించారు.ఈ సందర్భంగా సలాది శ్రీనివాస బాబు మీడియాతో మాట్లాడుతూ పేదల కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్రంగా అని ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అలాగే ఈరోజు అన్న క్యాంటీన్లో కార్యక్రమాన్ని నిర్వహించమని అన్నారు. పదిమందికి ఆకలి తీస్తున్న అన్న క్యాంటీన్ అందించిన కూటమి ప్రభుత్వం నకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు అని అలాగే నియోజవర్గం ఎంత అభివృద్ధి చేస్తున్నా ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోనేటి రామకృష్ణ, నరహరశెట్టి సూర్యనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు హిట్లర్, సిద్దు భావన్నారాయణ, పేపకాయల చంద్రశేఖర్, మాగిశెట్టి మణికంఠ, పెరికెల గౌతమ్, వీర మహిళ నండూరి గంగాద్రి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *