పయనించే సూర్యుడు జూలై 5, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం పండురు గ్రామంలో నిర్వహించారు. ఈ ఉచిత శిబిరానికి ముఖ్య అతిథులుగా సొసైటీ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వల్ల ప్రజలు ఇబ్బందులు గురి కాకుండా వారికి వైజు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని జనరల్ చెకప్ తో పాటు అవసరమైన వారికి మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే బీపీ, షుగర్ చెక్ చేసి మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం డాక్టర్ రమ్య మాట్లాడుతూ 14 సంవత్సరాల బాలికలకు క్యాన్సర్ నివారించేందుకు హెచ్పీవీ వ్యాక్షను వేయించుకోవాలని దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. పదివేల రూపాయలు చేసే ఈ వ్యాక్షను ఉచితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి బి శ్రీనివాస్ రెడ్డి, పండూరు సొసైటీ సెక్రెటరీ గొల్లపల్లి సత్తిబాబు, డాక్టర్ కే మాధవి, ఎంపీహెచ్ఓ ఆదినారాయణ, సిహెచ్ఓ టి రాణి, ఎంపీహెచ్ ఎస్ రామారావు, సొసైటీ సెక్రటరీ తుమ్మలపల్లి సుబ్బారావు మరియు పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.