పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. కష్టాల్లో ఉన్న తోటి జర్నలిస్ట్ కుటుంబానికి తామున్నామంటూ పలాస జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన జర్నలిస్ట్ ఎజ్జల మురళి తండ్రి రామమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు శనివారం ఆసుపత్రికి వెళ్లి రామమూర్తి ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ప్రెస్ క్లబ్ తరఫున కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జర్నలిస్టుల కష్టసుఖాల్లో అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలాస జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు నేతాజీ, జయంత్ కుమార్, ట్రెజరర్ రత్నాల రమేష్ గౌరవ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సురో, వైస్ ప్రెసిడెంట్ సర్వాణ రవిరమేష్, క్రమశిక్షణ సభ్యులు కొంచాడ రవి,.కిషోర్ మాస్టర్ .మోస కుమార్.సహాయ కార్యదర్శి ఎన్. రమేష్, సభ్యులు టీ.నాగరాజు. రాజు. మురళి పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.