పయనించే సూర్యుడు న్యూస్. జూలై5 రిపోర్టర్. కొత్వాల లింబాద్రి నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం ప్రపంచ క్యారమ్ క్రీడా వేదికపై మన భీమ్‌గల్ ప్రాంత క్రీడాకారులు దయాళ రవీందర్ గౌడ్ తన సత్తా చాటి రన్నరప్‌గా నిలిచి నేటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని భీమ్‌గల్ క్యారమ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ తహేర్ ఆధ్వర్యంలో స్థానికంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనాటి మధుర జ్ఞాపకాలను క్రీడాకారులు నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నీలం రవి మాట్లాడుతూ.. “మన భీమ్‌గల్ గడ్డపై నుంచి ఇప్పటివరకు 9 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి (నేషనల్స్) పోటీల్లో పాల్గొనడం మన ప్రాంతానికి దక్కిన గొప్ప గౌరవం. ఒక చిన్న ప్రాంతం నుంచి అంతర్జాతీయ, జాతీయ స్థాయిల్లో మన ఆటగాళ్లు రాణించడం భీమ్‌గల్ క్రీడా చరిత్రలోనే చిరస్మరణీయం. క్యారమ్ క్రీడలో మన ప్రాంత కీర్తిని దశదిశలా చాటిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యారమ్ అసోసియేషన్ సభ్యులు, సతీష్, రాజేందర్ వెంకటనర్సయ్య శివానంద్ శ్యామ్ రహీం హునాని, సురేందర్ మోహన్ ఇక్రమ్ ఇబ్రహీం లక్ష్మణ్ క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.