దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం

"జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పడాల రాములు బాధ్యతలు చేపట్టడంపై శుభాకాంక్షలు"

పయనించే సూర్యుడు జులై 5 రాజేష్) దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన జనగామ మల్లారెడ్డికి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన పడాల రాములకు సూరంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనగామ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారి సహకారంతో ప్రజల్లోనే ఉంటూ పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పడాల రాములు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల నర్సింలు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బొల్లం రాజేష్, పార్టీ నాయకులు బొల్లం యాదగిరి, దండు భూపాల్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *