పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపే ట్ట నియోజకవర్గం జులై 5 జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డు నందు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద వారి 79 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వట్టెo మనోహర్ అధ్యక్షత వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ లేబర్ బోర్డు చైర్ పర్సన్ అమృతా రెడ్డి ,రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి చౌడవరపు జగదీష్ , మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి , ముఖ్య అతిథులుగా ఈ వేడుకలలో పాల్గొన్నారు వట్టెం మనోహర్ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా పేదల ఆశాజ్యోతి అని ఒక ఎమ్మెల్యేగా విజయవాడ నగరంలో సేవలు ప్రారంభించి తెలుగు రాష్ట్రాలలో వంగవీటి రంగా అనే బ్రాండ్ ను ప్రజలకు ధైర్యంగా నిలిపిన వ్యక్తి.. వంగవీటి మోహన రంగా అదే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కాదు కానీ ఈ తెలుగు రాష్ట్రాలలో రెండు లక్షలకు పైగా ఆయన విగ్రహాలను అభిమానులు ఏర్పాటు చేసుకోవడం ఆయన గొప్ప ప్రజానాయకుడిని నిదర్శనంగా మనం భావితరాలకు చెప్పుకోవాల్సి ఉన్నది… వేల్పుల రవికుమార్ మాట్లాడుతూ.. వంగవీటి మోహన రంగా అనే ప్రజా నాయకుడిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సహకారంతో హత్య చేయించారని అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగా ఆయన వర్ణించారు ఈరోజు వంగవీటి మోహన రంగా బతికి ఉంటే విజయవాడలో పోలీసు లాకప్ డెత్ లు జరిగేవా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు… అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతిపరులు వంగవీటి మోహన్ రంగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జోహార్ వంగవీటి మోహన రంగా అని నినాదాలు చేసి కేక్ కటింగ్ చేసుకొని ప్రతి ఒక్కరికి కేకులు స్వీట్లు కూడా పంచడం జరిగింది
.
