నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు అందజేత

పయనించే సూర్యుడు న్యూస్, మే 30 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణంలోని నిరుపేద వృద్ధులకు, బిక్షాటన చేసేవారికి వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం భోజనం పొట్లాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి ఏలేశ్వరం ఇంచార్జ్ పెండ్యాల రాజు మాట్లాడుతూ రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన తీపర్తి సుబ్బారావు, ప్రభావతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వారి అర్ధిక సాయంతో సుమారు 50మంది వృద్ధులకు, బిక్షాటన చేసుకునే వారికి భోజనం పొట్లాలను, బిస్కెట్ ప్యాకెట్లు, కేకు ప్యాకెట్లు అందజేయడం జరిగిందని అన్నారు. అలాగే పుట్టినరోజు పెళ్లిరోజు తదితర కార్యక్రమాలకు ఇలా ఆహార పొట్లాలను పంపిణీ చేయాలంటే వివేకానంద సేవా సమితి సభ్యులను సంప్రదించగలనన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ భోజనం హోటల్ శ్రీనుబాబు, మెడికల్ షాప్ లక్ష్మణ్, డోర్ షాప్ రమేష్, సునీల్, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *