కార్పొరేట్ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న జీనియస్ గ్లోబల్ స్కూల్ పట్టించుకోని అధికారులు

* అనుమతి లేని జీనియస్ గ్లోబల్ స్కూల్ ను సీజ్ చేయాలని బైఠాయించిన విద్యార్థి సంఘాలు * ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం స్కూల్ ఫీజు బోట్లు ఏర్పాటు చేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ జులై 04, 2 026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మండలం లోని వున్నా జీనియస్ గ్లోబల్ ప్రైవేట్ పాఠశాలకు హైస్కూల్ సెక్షన్ విద్యా శాఖ ఎలాంటి అనుమతులు లేకపోయినా అలాగే తరగతులు నిర్వహిస్తున్నారు స్కూల్ ప్రక్కనే పెట్రోల్ బంక్ వున్నా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని పి డి ఎస్ యు, పి ఎస్ యు ఆర్యవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు రాజేష్, సురేష్, పోతులపాడు నాగరాజు, సుధాకర్, రాజేష్ నాయుడు, మాట్లాడుతూ 2026 2027 విద్యా సంవత్సరానికి హై స్కూల్ సెక్షన్ కు విద్యాశాఖ నుండి అనుమతులు లేకుండానే పాఠశాల నిర్వహిస్తున్న పాఠశాలను విద్యార్థుల తరగతులను బహిష్కరించడం జరిగింది. అలాగే స్కూల్ మొత్తం కాంపౌండ్ వాల్స్ తో, రేకుల షెడ్ లో ఏర్పాటుచేసి కనీస మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న కూడా స్కూల్ ఏర్పాటు చేసి విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంగిస్తున్నారాని మండల అధికారులకు విద్యార్థుల సంఘాలు పలుమార్లు వినతి ఇచ్చిన కూడా నోటీసు వరకే పరిమితమై నిమ్మక నేరెత్తినట్లు మండల విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తూ జీనియస్ గ్లోబల్ పాఠశాల వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా మండల పరిధిలో ఫీజులకు మించి ఈ స్కూల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అడ్మిషన్,బుక్స్ యూనిఫామ్ ఫీజుల పేరుతో ఒక్క విద్యార్థి నుండి పదివేల నుండి 30 వేల వరకు వసూలు చేస్తున్నారని సెమి బిల్డింగ్ పేరుతో ఉన్న ఈ స్కూల్ కు డిప్యూటీ డిస్టిక్ విద్యాశాఖ అధికారులు ఇటువంటి అనుమతులు ఇవ్వరాదని పక్క బిల్డింగ్ ప్రహరి గోడ స్కూల్ కు తగినంత స్థలం ఉన్నప్పుడు హై స్కూల్ సెక్షన్ అనుమతులు ఇవ్వాలని ఎలా పడితే అలా అనుమతులు ఇస్తామంటే విద్యాశాఖ అధికారులపై విద్యార్థి సంఘాలు దశలవారీగా ఉద్యమాల చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నాగేంద్ర, వినయ్, రాజు విద్యార్థులతో పాటు తల్లితండ్రులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *