పూండిలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 4 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం వజ్ర కొత్తూరు మండలం పూండి లో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష సహకారంతో మదర్ థెరిస్సా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ హాస్పిటల్, శ్రీకాకుళం సహకారంతో గురువారం రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ,మదర్ థెరిస్సా సేవాసంస్థ అధ్యక్షులు పుచ్చ ఈశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి సేవా సంస్థ ఉపాధ్యక్షులు కర్ని రమణ ఘనంగా ప్రారంభించారు .గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.పూండి బస్టాండ్ డి.హెచ్.ఆర్ కాంప్లెక్స్ దగ్గర నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను పొందారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగ్,మెమోగ్రాఫీ ఇతర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు.వైద్య నిపుణులు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో అవసరమని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షులు పుచ్చ ఈశ్వరరావు, కర్ని రమణ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో పి 4 ప్రతినిధి శ్రీను,కో-ఆప్షన్ సభ్యులు విఘ్నేష్, శంకర్, వేణుగోపాల్, శివ టీడీపీ సీనియర్ నాయకులు మోహనరావు, నారాయణ, చంద్రయ్య, నిహాల్ కృష్ణార్జున యూత్,గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *