పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 05 మామిడిపెల్లి లక్ష్మణ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులకు రావలసిన ఆరు డిఏ బకాయిలు, పి ఆర్ సి అమలు పెండింగ్ బకాయిలు తొందరగా విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాయికల్ మండల శాఖ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ అరుణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెరుకు మహేశ్వర శర్మ జిల్లా నాయకులు కె.రజనీకాంత్,వి.మధు మండల ప్రధాన కార్యదర్శి పుర్రె రమేష్, నాయకులు కె.రమేష్, శ్రీనివాస్,ఆర్ జయదేవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *