పెనుబల్లి మండలం సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా నారుమళ్ళ వెంకటేశ్వరరావు

పయనించే సూర్యుడు: జూన్ : 8/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు పెనుబల్లి మండల సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నారుమళ్ళ వెంకటేశ్వరరావు కు ఎమ్మెల్యే దంపతుల శుభాకాంక్షలు పెనుబల్లి మండల సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కుప్పెనకుంట్ల గ్రామ సర్పంచ్ నారుమళ్ళ వెంకటేశ్వరరావు శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ , డైనమిక్ లీడర్ మట్టా దయానంద్ నారుమళ్ళ వెంకటేశ్వరరావు కు శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మండల సర్పంచ్‌ల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దంపతులు, ఆయనకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *